Ticker

6/recent/ticker-posts

అమరావతి నిర్మాణం ప్రజల సహకారంతో ముందుకు సాగాలనే సంకల్పంతో “అమరావతికి జీవం పోద్దాం.. రూ.116/- సాయం చేద్దాం” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు


 RSR న్యూస్

తుళ్లూరు, తేదీ : ______
రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా తుళ్లూరు లోని సి ఆర్ డి ఏ (CRDA) కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. 

       ఈ సందర్భంగా గ్రీన్ అంబాసిడర్స్ మరియు కార్యాలయ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ నిర్వహించి శాలువాలతో సన్మానించారు.

అమరావతి నిర్మాణం ప్రజల సహకారంతో ముందుకు సాగాలనే సంకల్పంతో “అమరావతికి జీవం పోద్దాం.. రూ.116/- సాయం చేద్దాం” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించగా, కార్యాలయ సిబ్బంది మరియు గ్రీన్ అంబాసిడర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమరావతి అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ద్వారా సి ఆర్ డి ఐ అకౌంట్‌కు నగదు బదిలీ చేసి అమరావతి నిర్మాణంలో తామూ భాగస్వాములమవుతున్నామని తెలిపారు. ప్రజల సహకారం, సామూహిక బాధ్యతతోనే రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ మనోజ్ అమరావతి రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా నిలవాలని, ప్రతి ఒక్కరూ చిన్న మొత్తమైనా సహాయం చేయడం ద్వారా రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రీన్ అంబాసిడర్స్ చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సి ఆర్ డి ఏ డిప్యూటీ డైరెక్టర్ బొర్ర శ్రీనివాసరావు , గుడివాడకు చెందిన రెడ్డి బంగారయ్య (AGP) తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అమరావతి నిర్మాణం ప్రభుత్వంతో పాటు ప్రజలందరి బాధ్యత అని, సామూహిక సహకారంతో రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆకాంక్షించారు.