Editor: Chintapalli Srinivasarao 9949291526
ఏలూరు, తేదీ: 07-01-2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలో పర్యటించారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్యమంత్రివర్యులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ప్రాణాధారమైన బహుళ ప్రయోజనాల ప్రాజెక్ట్ అని పేర్కొన్న బడేటి రాధాకృష్ణయ్య చంటి , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులకు సాగునీరు, పరిశ్రమలకు నీటి వనరులు, ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.
ఈ పర్యటన సందర్భంగా ప్రాజెక్ట్ పనులపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరం పూర్తయితే రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు.




