Ticker

6/recent/ticker-posts

ఏలూరు, తేదీ: 07-01-2026 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.



RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526
 
ఏలూరు, తేదీ: 07-01-2026

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ , ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మరియు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగా రోషన్ హాజరై రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ,
రైతుల భూమి హక్కులను శాశ్వతంగా భద్రపరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఈ పథకం ద్వారా రైతులకు చట్టబద్ధమైన భూమి హక్కులు కలుగుతాయని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రెవిన్యూ అధికారులు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.