Ticker

6/recent/ticker-posts

ఎన్టీఆర్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఘన నివాళి. ‎ - ‎ఎన్టీఆర్ లాంటి వ్యక్తి యుగానికొక్కడే పుడతాడు - ఎంపీ పుట్టా మహేష్ కుమార్.


 RSR NEWS


Editor: Chintapalli Srinivasarao  9949291526


ఎన్టీఆర్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఘన నివాళి.

- ‎ఎన్టీఆర్ లాంటి వ్యక్తి యుగానికొక్కడే పుడతాడు - ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

‎ఏలూరు, జనవరి 18: మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఘన నివాళి అర్పించారు. 


ఈ సందర్భంగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక "ఎన్టీఆర్" అన్నారు. ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం అని, సినిమాల్లో రాముడు అన్నా, కృష్ణుడు అన్నా ఆయనేనని, ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఏ నటుడు చేయనన్ని గొప్ప గొప్ప పాత్రలను పోషించిన మహానటుడు శ్రీ ఎన్టీ రామారావు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. 


తెలుగువాడిగా పుట్టి, దేశ రాజకీయాలనే మలుపుతిప్పిన  గొప్ప నేత ఎన్టీఆర్ అన్నారు. ఈరోజు బీసీ కులాలకు చెందిన తన వంటి ఎంతోమంది రాజకీయాల్లోకి రాగలిగామంటే ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, పేదల సంక్షేమమే లక్ష్యంగా  చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎన్టీఆర్ ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో రాష్ట్రంలో మరో 20-30 ఏళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లాంటి మహా మనీషి యుగానికి ఒక్కడే పుడతాడన్న ఎంపీ, త్వరలోనే రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టు కార్యరూపం దాల్చబోతోందన్నారు.