Editor: Chintapalli Srinivasarao 9949291526
ఏలూరు, తేదీ: 10-01-2026
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గోపాలపురం గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు కృషి చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అభినందిస్తూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణ యువతను చెడు అలవాట్ల నుంచి దూరం చేసి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు.
క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ, విజేతలకు అందజేయనున్న బహుమతులను పరిశీలించారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొన్న ఆటగాళ్లకు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ గ్రామంలో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చిందని పాల్గొన్న వారు పేర్కొన్నారు.


