RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
కైకలూరులో ఘనంగా విశ్వబ్రాహ్మణ జాతిరత్నం గానాల రామమూర్తి 134వ జయంతి
కైకలూరు, ఏలూరు జిల్లా:
కైకలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ జాతిరత్నం, బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి గారి 134వ జయంతి వేడుకలు కైకలూరులో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా గానాల రామమూర్తి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలు, విశ్వబ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి అందించిన కృషిని నాయకులు స్మరించుకున్నారు.
కైకలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తుపాకుల సోమాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, సంఘ నాయకులు ఐక్యతతో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో
అధ్యక్షులు తుపాకుల సోమాచారి,
ప్రధాన కార్యదర్శి మోజేష్ కుమార్,
ఉపాధ్యక్షులు తుపాకుల సుబ్బారావు,
మండవల్లి మండల కార్యదర్శి ప్రదీప్,
ఉప కోశాధికారి కుప్పిలి సత్యనారాయణ,
ముదినేపల్లి మండల ఉప కార్యదర్శి సింహాద్రి ప్రసాద్,
కమిటీ సభ్యులు సింహాద్రి సత్యనారాయణ, లాలు, నాగోజి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని, గానాల రామమూర్తి గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు


