Ticker

6/recent/ticker-posts

ఏలూరు రోమన్ కేథలిక్ మిషన్ పీఠాధిపతి భిషప్ పొలిమేర జయరావు గారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో






RSR NEWS

Editor: Chintapalli Srinivasarao


ఏలూరు రోమన్ కేథలిక్ మిషన్ పీఠాధిపతి భిషప్ పొలిమేర జయరావు గారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివప్రసాద్ గారు, విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మావిళ్ళపల్లి పార్ధసారధి గారు తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అతిథులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, సౌభ్రాతృత్వం, మానవ సేవా భావనలు సమాజంలో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.