RSR NEWS
Editor: Chintapalli Srinivasarao
Editor: Chintapalli Srinivasarao
ఏలూరులో దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం లో భాగంగా ఏలూరు జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో పోలియో బూత్ ఏర్పాటు చెయ్యడం జరిగినది,
ఏలూరులో దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం లో భాగంగా ఏలూరు జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఫ్యామిలీ ప్లానింగ్ డా ఆనంద్ కుమార్ మరియు వారి సిబ్బంది పర్యవేక్షణ లో పోలియో బూత్ ఏర్పాటు చెయ్యడం జరిగినది.. ఈ కార్యక్రమంలో DCHS డా పాల్ సతీష్ , GGH సూపరింటెండెంట్ డా సమాధానరాజు , ఇంచార్జి సూపరింటెండెంట్ డా అచ్యుతారావు , రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు కమిటీ సభ్యులు అజయ్ బాబు బూత్ ను ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేసినారు. మరియు మానవతా సభ్యులు కూడా పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ రోజు 110 మంది పిల్లలకు పోలియో చుక్కలు వెయ్యడం జరిగింది.. ఈ కార్యక్రమం 22nd, 23rd రోజులలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లో జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలు అందరు మీ పిల్లలకు ( 0----5 ఇయర్స్) పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారి నుండి రక్షించుకోమని డా ఆనంద్ కుమార్ తెలియజేసారు..


