Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి అండగా వైద్య విద్యార్థిని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్




 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao
ఏలూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి అండగా వైద్య విద్యార్థిని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్

మండవల్లి/కనుకొల్లు:
మండవల్లి మండలం కనుకొల్లు గ్రామానికి చెందిన పాలెపు వెంకన్న మరియు గృహ లక్ష్మి దంపతులు గత వారం కంకిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మృతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
పెద్ద కుమార్తె దీపిక బీటెక్ చదువుతుండగా, రెండో కుమార్తె సిరి ఇంటర్ విద్యను కొనసాగిస్తోంది. కుమారుడు వెస్లీ కూడా విద్యార్థే. తల్లిదండ్రులను కోల్పోయిన ఈ ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు.
ఈ విషయం తెలుసుకున్న వైద్య విద్యార్థిని అమరావతి అంబాసిడర్,అంబుల వైష్ణవి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వైష్ణవి తరఫున ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ చేతుల మీదుగా రూ.5,000/- నగదు సహాయం బాధిత కుటుంబానికి అందజేయబడింది.
ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ,
“తల్లిదండ్రులను కోల్పోయిన ఈ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా, మేము ఎప్పుడూ అండగా ఉంటాము. వారి పిల్లల భవిష్యత్తు కోసం సాధ్యమైనంత సహాయం చేస్తాము” అని తెలిపారు.
వైద్య విద్యార్థిని అమరావతి అంబాసిడర్, చిరంజీవి,వైష్ణవి చూపిన మానవతా స్పందనకు గ్రామస్తులు మరియు స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.