ఏలూరు, RSR,: న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్, ఏలూరు, : జిల్లాలో ఈనెల 21 నుండి 23 వరకు జరగనున్న పల్స్ పోలియో లో జిల్లాలోని 5 సంవత్సరంలోపు ప్రతీ చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 5 సంవత్సరాలలోపు 2 లక్షల 4 మంది చిన్నారులు ఉన్నారని, వీరిలో గ్రామీణ ప్రాంతంలో లక్షా 49 వేల 470 మంది, పట్టణ ప్రాంతాలలో 29 వేల 827 మంది, గిరిజన ప్రాంతాలలో 20 వేల 707 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వారికి అవసరమైన వాక్సిన్ డోసులు సిద్ధం చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 1707 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతీ గ్రామంలోనూ పోలియో వాక్సిన్ వేసేందుకు కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. . ఈనెల 21వతేదీన ప్రతీ చిన్నారికీ 1707 వ్యాక్సినేషన్ కేంద్రాలు , 72 మొబైల్ కేంద్రాలు ద్వారా పల్స్ పోలియో వాక్సిన్ అందించడం జరుగుతుందని, ఆర్టీసీ బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటుచేసి పోలియో వాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. అనంతరం 22, 23 వ తేదీలలో ఇంటింటికీ వెళ్లి పోలియో వాక్సిన్ తీసుకోని చిన్నారులను గుర్తించి, వారికి వారి ఇంటివద్దే వాక్సిన్ అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. .

