Ticker

6/recent/ticker-posts

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పద్మశ్రీప్రసాద్ 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ




 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పద్మశ్రీప్రసాద్ 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ


  RSR NEWS


Editor: Chintapalli Srinivasarao

 ఏలూరు  :  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ క్యాంపు కార్యాలయంలో బొబ్బిలి తాండ్ర పాపారాయుడు – రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ (విజయవాడ) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు పద్మశ్రీప్రసాద్ చైర్‌పర్సన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించమని కోరగా, చైర్‌పర్సన్  క్యాలెండర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

అనంతరం ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, సమాజ సేవే లక్ష్యంగా బొబ్బిలి తాండ్ర పాపారాయుడు – రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాలలో ట్రస్ట్ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ ఘంటా ప్రసాద్ రావు, ట్రస్ట్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వరావు, ఏలూరు నగర కొప్పుల వెలమ సంఘ అధ్యక్షులు భీమవరపు పాపారావు, మాజీ అధ్యక్షులు బల్ల శివతో పాటు ట్రస్ట్ సభ్యులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.