RSR NEWS
రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేశ్‌ను కలిసిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి( చంటి), రాధాకృష్ణయ్య
ఏలూరు, జనవరి 08:
ఉండవల్లిలోని నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఏలూరు జిల్లా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఉండవల్లిలో జరిగిన పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం అనంతరం జరిగింది.
ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) , జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్తారెడ్డి మంత్రి లోకేష్‌ను కలిసి జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత బలోపేతం మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలవాలని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏలూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా జిల్లా నేతలు స్పష్టం చేశారు.





