RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
ఏలూరు, తేదీ: 06-01-2026
హజరత్ మౌలా అలీ ముష్కిల్ కుషా మహాత్ముల (గొలుసుల పంజా) వారి ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఏలూరులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, దేశంలో సౌభ్రాతృత్వం, శాంతి, సమగ్ర అభివృద్ధి కోసం ఆకాంక్షించారు. అన్ని మతాలు సమానమేనని, మత సామరస్యం ద్వారానే సమాజంలో శాంతి నెలకొంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు , డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ కరణం గణేష్ , డివిజన్ ఇన్చార్జ్ శ్రీమతి తవ్వా అరుణకుమారి , ముస్లిం సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



