Ticker

6/recent/ticker-posts

ఏలూరు శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినత పత్రం అందజేశారు.


 







ఏలూరు శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినత పత్రం అందజేశారు.   


 ఏలూరు న్యూస్ రైట్ ప్రతినిధి: ఏలూరు నియోజకవర్గం సమస్యలు గూర్చి స్థానిక శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినత పత్రం అందజేశారు.. 


రాజధాని సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం చంద్రబాబు నాయుడుని కలిసిన చంటి పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు... 


ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఖాళీ స్థలాలకు పన్నులు అధికంగా అందిస్తున్నారని దీనివలన స్థల యజమానులు ఇబ్బంది పడుతున్నారని ఇళ్ల కు సంబంధించి టాక్స్లు తక్కువగా ఉండటం ఖాళీ స్థలాలకు టాక్స్లు ఎక్కువగా ఉండటం ఇబ్బందికరంగా మారిందని ఇంటికి విధించిన మాదిరిగానే ఖాళీ స్థలాలకు తక్కువగా టాక్స్లు విధించాలని దీని వలన స్థల యజమానులు టాక్స్లు కట్టేందుకు ముందుకు వస్తారని రెవెన్యూ కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రికి వివరించారు... 


ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు... 

ఈడాకు రెవెన్యూకు మధ్య సమన్వయం లోపించిందని దీనివలన ఈడ పరిధిలో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య కూడా పరిష్కరించాలని కోరారు... 


తాను ఇప్పటివరకు అబ్జర్వర్గా విధులు నిర్వహించిన కైకలూరు పోలవరం చింతలపూడి నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేశానని, ఇకముందు జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కలిగించే పార్టీ పట్ల ప్రజలకు మరింత విశ్వాసం పెంపొందించేలా కృషి చేస్తానని, నాయకులందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానని మీరు నాపై ఉంచిన నమ్మకానికి పదింతలు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాధాకృష్ణయ్య (చంటి )కృతజ్ఞతలు తెలియజేశారు.