RSR NEWS
Editor: Chintapalli Srinivasarao
చిన్ని చిన్ని మనసులు చిత్రానికి మరో అవార్డు
చిన్ని చిన్ని మనసులు కు మరో అవార్డు
కొమ్మిరెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై కొమ్మిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత గా, రచయిత డా. అడబాల లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన " చిన్ని చిన్ని మనసులు " లఘు కు చిత్రం డిసెంబర్ 21 తేదీ ఆదివారం రాజమండ్రి లో జరిగిన "అభినయ గోదావరి కళానీకేతన్ " వారు నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు లఘు చిత్రాల పోటీలలో
బెస్ట్ అఫ్ టెన్ ఫిల్మ్ అవార్డు తో పాటు, ఉత్తమ సంగీతం అవార్డును కూడా గెలుచుకుంది. ఈ అవార్డులను ప్రముఖ సినీ సీనియర్ నటులు శ్రీ నాగ మహేస్ గారి చేతుల మీదుగా డైరెక్టర్ డా. అడబాల లక్ష్మీనారాయణ, కో - డైరెక్టర్ నాగరాజు కౌరు గార్లు అందుకున్నారు.

