Editor: Chintapalli Srinivasarao 9949291526
కొయ్యలగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ హాజరై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తూ పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సేవలు అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా, సందడిగా సాగింది.


